Sexual Desire : మాల్యతో ప్రేమాయణం.. లక్షల్లో టోపి పెట్టిన యువతి

by Sumithra |   ( Updated:2021-06-02 08:22:58.0  )
young woman Cheating
X

దిశ, వెబ్‌డెస్క్ : మోహంతో ఎంతటి మగాడినైనా మోసం చేయవచ్చని నిరూపించిందీ యువతి. ప్రేమ, పెళ్లి అంటూ వలపు వల వేసి అందిన కాడికి నొక్కేసి.. ఎంచక్కా చెక్కేసిందీ కి‘లేడీ’. అనంత్ మాల్య అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని నమ్మించి లక్షల రూపాయలు కొట్టేసింది.

కర్ణాటక రాష్ట్రం యశవంతపురకు చెందిన అనంత్ మాల్యకు బెంగళూరుకు చెందిన యువతిలో 2019లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మొదట్లో స్నేహమే నడిచినా.. సదరు యువతి అతగాడిని ప్రేమలోకి దింపింది. ఆమెను నమ్మిన మాల్య.. యువతి ప్రేమ మత్తులో మునిగిపోయాడు. ఇదే అదునుగా భావించిన ప్రేయసి.. డియర్.. నువ్వే నా సరైన జోడి.. నువ్వు లేనిది నేను ఉండలేను. పెళ్లంటే చూసుకుంటే నిన్నే చేసుకుంటానని మాటలతో మత్తు చల్లింది.

ఆమె ప్రేమ, పెళ్లి నిజమేనని నమ్మిన మాల్య.. ఆమెకు రూ.30 లక్షలు సమర్పించుకున్నాడు. ఇలా రెండేళ్లుగా వీరి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో అనంత్ మాల్యకు ఇటీవల డబ్బులు అత్యవసరపడి సదరు యువతిని తీసుకున్న రూ.30 లక్షలు ఇవ్వాలని కోరాడు. దానికి అప్పుడు, ఇప్పుడు ఇస్తా అనుకుంటా దాటవేస్తూ వస్తోంది. వారం రోజుల క్రితం ఆమెను గట్టిగా నిలదీయడంతో పరారీ అయింది. ఫోన్ సైతం స్విచ్ఛాప్ లో పెట్టింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మాల్య యశవంతపుర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఫొటో పట్టుకుని ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed