- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌పై చీటింగ్ కేసు
దిశ, కాళోజీ జంక్షన్ : రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మరో ఇద్దరిపై వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అల్లూరి ట్రస్టులో ఆర్థిక లావాదేవీలపై అవకతవకలకు పాల్పడ్డారంటూ మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ రాఘవేందర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
హన్మకొండ న్యూశాయంపేటలోని అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు ఎంపీ బండా ప్రకాశ్ కార్యదర్శిగా ఉన్నారు. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో దాఖలు చేసిన ఆదాయపన్ను విషయంలో ఎంపీతోపాటు.. చార్టెడ్ అకౌంటెంట్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్ రూ.12,21,912 మేర నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తూ మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించి ఎంపీ బండాప్రకాశ్, సత్యనారాయణ, వంశీధర్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు కోర్టు ఆదేశాలతో ఐపీసీ 409, 417, 120బీ సెక్షన్లు, సీఆర్పీసీలోని సెక్షన్ 156(3) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు.