- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్ పై ఎంఐఎం నేత సంచలన వ్యాఖ్యలు..

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, మిత్రపక్షం ఎంఐఎం పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంఐఎంకు చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో కేటీఆర్ ఈ మధ్యే కళ్లు తెరిచిన చిలుక అని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి గద్దె ఎక్కించడమూ తెలుసునని… గద్దె దించడమూ తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయం ఎంఐఎం పార్టీ ఇంటి ఎదుట గుమస్తా లాంటిదని చెప్పుకొచ్చారు. మజ్లీస్ పార్టీ తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని’ హెచ్చరించారు.
Next Story