- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏమిచ్చి రుణం తీర్చుకోను : ఛార్మి

చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి.. నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నిర్మాతగా మారి పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుస సినిమాలు రూపొందిస్తోంది. ఇక నటనకు ఫుల్‌స్టాప్ పెట్టి, పూర్తిస్థాయిలో నిర్మాతగా మారినట్టు తన పుట్టినరోజునే వెల్లడించింది.
ఓ ఫ్యాన్ ఛార్మికి తన అభిమానంతో మాటలు రాకుండా చేశాడు. ఛార్మి అభిమాని అయిన ప్రభాకర్ అనే వ్యక్తి తన చేతి మీద ఛార్మి కౌర్ పేరును పచ్చ బొట్టు వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో ఎమోషనల్ అయిన ఛార్మి.. ‘నేను నీకు ఏం చేశానని ఇంత ప్రేమ చూపించావు ప్రభాకర్.. నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను’ అని సోషల్ మీడియాలో తన అభిమాని ఫోటోను షేర్ చేసింది. ‘ఈ పచ్చ బొట్టుతో శాశ్వతంగా జీవించాల్సి ఉంటుంది.. ఇంత గొప్ప ప్రేమ అందించిన మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రేమను అందిస్తా’ అని తెలిపింది.
ఛార్మి కౌర్ పేరు.. పక్కనే గ్లాసెస్, చిన్న హెయిర్‌తో అందమైన బొమ్మ ముఖంతో ఉన్న పచ్చబొట్టు చాలా నచ్చిందన్న ఛార్మి.. కృతజ్ఞతలు తెలిపింది.
View this post on Instagram
A post shared by Charmmekaur (@charmmekaur) on May 20, 2020 at 12:10am PDT