ఆ జిల్లాలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు

by Sridhar Babu |

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో శుక్ర‌వారం నుంచి బ్యాంకుల ప‌నివేళ‌ల్లో మార్పులు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి మే 3 వ‌ర‌కు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని తెలిపారు. ఖాతాదారులు బ్యాంకుల వ‌ద్ద సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. అలాగే మాస్కు లేకుండా వ‌స్తే మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇక ప్ర‌భుత్వం ఖాతాల్లో జ‌మ‌చేసిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు మీ ఆధార్ కార్డు ద్వారా పోస్ట్ ఆఫీస్‌లో కూడా తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Tags: Changes, working hours, banks,bhadradi kothagudem

Next Story

Most Viewed