కొవిన్ పోర్టల్‌లో మార్పులు.. ఇక నుంచి ఆ నెంబర్‌ చెబితేనే టీకా

by Anukaran |   ( Updated:2021-05-07 05:11:48.0  )
కొవిన్ పోర్టల్‌లో మార్పులు.. ఇక నుంచి ఆ నెంబర్‌ చెబితేనే టీకా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా పంజా విసురుతోంది. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు తహతహలాడుతున్నారు. కానీ వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు లభిస్తుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిన్ వెబ్ సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్లాట్స్ ఖాళీ లేవని చూపిస్తుంది.

అయితే స్లాట్ బుక్ అయినా.. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లకపోతే వ్యాక్సినేషన్ కంప్లీటెడ్ అని మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఈ క్రమంలో కొవిన్ పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటినుంచి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్‌కి నాలుగు డిజిట్ల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో ఈ కోడ్ చెప్పాల్సి ఉంటుంది.

ఈ కోడ్ చెబితేనే వ్యాక్సిన్ ఇస్తారు. లేకపోతే వ్యాక్సిన్ వేయరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed