- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING : ఆయన అక్కడా.. ఇక్కడా ఓటు కావాలంటున్నారు : మంత్రి అంబటి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేతపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామంపై నమ్మం లేదని అన్నారు. ఓటర్ల తుది జాబితాపై ఈసీకి దత్తపుత్రుడితో కిలిసి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం అని రాంబాబు అన్నారు. చంద్రబాబుకు నిజ స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థం అయిందని కామెంట్ చేశారు. ఈ ఎన్నికలతో ఆయన పని అయిపోతుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఓటేసిన వారు ఏపీలోనూ ఓటేస్తామంటే కుదరదు అని తెలిపారు. రెండు చోట్ల ఓటు వేయడం భారత ప్రజాస్వమ్యానికే విరుద్ధమని అన్నారు. ఒక వ్యక్తి ఎక్కడో ఒక్క చోటే ఓటు హక్కును కలిగి ఉండాలన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా అక్కడా.. ఇక్కడా ఓటు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు.