- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులను మోసం చేస్తున్నారు : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో : రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇవ్వకుండా వ్యవసాయం పండగ ఎలా అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రభుత్వంపై ట్విటర్లో విమర్శలు సంధించారు. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. తుఫానొస్తే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కులేదని చెప్పారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తే సస్పెండ్ చేస్తారని దుయ్యబట్టారు. ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదని మండిపడ్డారు. రైతు కన్నీరు తుడిచి వెంటనే పరిహారం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో రైతుకు సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదు. పంటబీమా ప్రీమియం కట్టలేదు. తుఫానొస్తే కనీసం పంటనష్టం అంచనా వేసే దిక్కుకూడా లేదు. అసెంబ్లీలో నిలదీస్తే సస్పెండ్ చేస్తారు. ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదు. రైతు కన్నీరు తుడవండి. వెంటనే పరిహారం అందించి ఆదుకోండి pic.twitter.com/9SUzqs8bSd
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 9, 2020