ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

by srinivas |
ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
X

దిశ,వెబ్ డెస్క్: ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థి శివలక్ష్మీ భర్త మంజునాథపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థులు అంజలి, కళావతి నామినేషన్లు పసంహరించుకున్నప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

మనోహర్, మంజునాథ్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. మనోహర్ కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిని పోటీకి దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story