- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోని అన్ని వాహనాలకు ఒకే సర్టిఫికేట్
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఒకే విధమైన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్‌ను జారీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే, కొత్తగా తిరస్కరణ సర్టిఫికేట్’ విధానాన్ని తెచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఇకమీదట అన్ని వాహనాలకు కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధృవీకరణ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
దీనిపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించనున్నట్టు, అదేవిధంగా పీయూసీ డేటాను నేషనల్ రిజిస్టర్‌కు లింక్ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా 1989 మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు చేసినట్టు కేంద్రం పేర్కొంది. అలాగే, మొదటిసారిగా తిరస్కరణ పత్రం అనే విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది. అనుమతించిన స్థాయి కంటే ఎక్కువగా ఉద్గారాలు వెలువడుతున్నట్టుగా తేలితే ఈ తిరస్కరణ సర్టిఫికేట్‌ను వాహన యజమానికి ఇవ్వనున్నారు. కొత్త నిబంధనలు పాటించకపోతే వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు పర్మిట్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ వెల్లడించింది.