- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నదీ జలాలపై కేంద్రం కొత్త ఉత్తర్వులు..
by Shamantha N |

X
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బోర్డుకు ప్రస్తుతం కోయంబత్తూరులో సీడబ్ల్యూసీ తరుపున ఉన్న సీఈ టీకే శివరాజన్, లక్నో యూజీబీఓ సీఈ అనుపమ ప్రసాద్లను నియమించారు. అదే విధంగా గోదావరి బోర్డుకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సీఈ ఎంకే సిన్హా, మరో సీఈ జీకే అగర్వాల్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. బోర్డుల పరిధిలోని ఇంజినీర్లు ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ అధికారులు కంటిన్యూ అవుతారని జీవోలో పేర్కొన్నారు.
Next Story