ఉల్లి దిగుమతులపై నిబంధనల సడలింపు..

by Anukaran |   ( Updated:2020-10-21 10:23:33.0  )
ఉల్లి దిగుమతులపై నిబంధనల సడలింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే విదేశాల నుంచి ఉల్లి దిగుమతికి ఇదివరకు విధించిన నిబంధనలను సడలించింది. ఈ సడలింపు డిసెంబర్ 15వరకు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతేకాకుండా ఆయా దేశాల్లో ఉల్లిని వ్యాపారులు భారత్‌కు పంపించేలా చొరవ తీసుకోవాలని విదేశాల్లోని భారత హై కమిషన్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వలన ఉల్లి దిగుబడి తగ్గడంతో పాటు దేశీయంగా సరఫరా కరువై మార్కెట్లు ధరలు పెరిగాయి.

Advertisement

Next Story