వెనకటి కాలంలో వెట్టిచాకిరికి లోనైనట్లు..

by Shyam |   ( Updated:2020-05-18 02:35:49.0  )
వెనకటి కాలంలో వెట్టిచాకిరికి లోనైనట్లు..
X

దిశ, మెదక్: లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గిందంటూ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మికులకు పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ సిద్ధిపేట జిల్లా కోశాధికారి శ్రామిక మహిళ దాసరి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చేర్యాల మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పని గంటల భారాన్ని పెంచే విధానాన్ని మొదటగా అమలు చేయాలని చూస్తోందన్నారు. క్రమక్రమంగా భారత దేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేసే పరిస్థితులు ఉన్నాయని, దీనివల్ల కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక వెనకటి కాలంలో వెట్టిచాకిరికి లోనైనట్లు ఈ విధంగా గురికాక తప్పదని, వెంటనే పని గంటల పెంపు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ దృష్టిలో పెట్టుకుని దళిత కార్మికులకు, పేద కార్మికులకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా 17 రకాల సరుకులు, ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, ప్రతి నెలా పదివేల రూపాయల నగదును ఆరునెలలపాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల బాధ్యులు బొగ్గు రాజు, రాళ్లబండి నాగరాజు, సంతోష్ కుమార్, కవిత, జ్యోతి, వెంకటేశం, రామచంద్రారెడ్డి, మల్లయ్య, కనకయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story