సుప్రీం సూచనలను కేంద్రం పాటించాల్సిందే : చాడ

by Sridhar Babu |
సుప్రీం సూచనలను కేంద్రం పాటించాల్సిందే : చాడ
X

దిశ, కరీంనగర్ సిటీ : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పాటించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కరోనాతో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చమురు ధరలు ఎడాపెడా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం, విపత్తులా మారిన కరోనా బాధితులను ఆదుకోవటంలో వెనక ముందాడటం సముచితం కాదన్నారు.

ఒకే దేశం ఒకే పన్ను అని ప్రకటించిన కేంద్రం చమురు ధరలపై జీఎస్టీని ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పెట్రో భారం తీవ్రంగా పడుతున్నా, కేంద్రం చలించకపోవటం శోచనీయమన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ, ఈ నెల 24న చమురు సంస్థల ఎదుట ధర్నా, 30న చలో రాజ్‌భవన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తప్పు చేశాడని, ఆత్మాభిమానం, వామపక్ష భావజాలమున్న ఏ వ్యక్తి కూడా ఆ పార్టీలో చేరడని తెలిపారు.

Advertisement

Next Story