‘ఏనుగు మృతికి కారకులను వదిలే ప్రస్తకే లేదు’

by Shamantha N |
‘ఏనుగు మృతికి కారకులను వదిలే ప్రస్తకే లేదు’
X

న్యూఢిల్లీ: కేరళలో ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అమానుష ఘటనపై పూర్తి నివేదిక పంపాలని కేరళ ప్రభత్వానికి ఆదేశాలు పంపింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ మాట్లాడుతూ.. ఏనుగుల్ని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వన్య ప్రాణులను హింసించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాగా, గత నెల పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో సమీపంలోకి వచ్చిన ఏనుగుకు అక్కడ కొంతమంది స్థానికులు.. పైనాపిల్‌లో పేలుడు పదార్థం కలిపి ఇచ్చారు. దీంతో ఏనుగు ఆ పండు తినే క్రమంలో నోటిలోనే బాంబు పేలడంతో దానికి తీవ్ర రక్తస్రావం అయింది. నొప్పితో అక్కడి నుంచి వెళ్లిన ఏనుగు సమీపంలోని ఓ నీటి కొలనులో నోటిని నీటితో తడుపుకుంటూ గాయాన్ని ఓర్చుకుంది. అంతేకాదు, ఆ గాయం బాధతోనే కొన్ని రోజులకు మృతి చెందింది. ఈ విషాద ఘటనతో మానవ హృదయం చలించి పోయింది. గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థం ఇచ్చి మృతికి కారణమైన ఆకతాయిలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఓ వైపు మృతి చెందిన గజేంద్రుడికి క్షమాపణలు కోరుతూనే.. కారకులను కఠినంగా శిక్షించాలని యావత్ దేశ ప్రజలు, ప్రముఖులు సైతం డిమాండ్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఏనుగు మృతిపై స్పందిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Advertisement

Next Story