హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ..

by Shyam |
bandaru
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం గెజిట్ విడుదల చేశారు. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ ‌ప్రదేశ్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయ హర్యానా రాష్ట్రానికి బదిలీ అయ్యారు.

కర్నాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌, గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ నియమితులయ్యారు.


Next Story

Most Viewed