ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

by Shamantha N |
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశీయంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రెండువారాల క్రితం వరకు రూ.10 నుంచి 12కే లభించిన కిలో ఉల్లిగడ్డ కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగితే సామాన్యులు ఇబ్బందులు పడటంతో పాటు విమర్శలను మూట గట్టుకోవాల్సి వస్తుందని.. ఈ నేపథ్యంలోనే వెంటనే అలర్టైన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Read Also…

దేశంలో తగ్గిన చైనా పెట్టుబడులు!

Advertisement

Next Story