- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: ఆర్.కృష్ణయ్య
దిశ, ముషీరాబాద్: పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యా నగర్ లోని బీసీ భవన్‌లో గురువారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకూ సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయరంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.
కానీ మనదేశంలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచి వేస్తున్నారని ఆరోపించారు. లోక్ సభలో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులో బిల్లు పాస్ అవుతుందన్నారు. బీసీల పట్ల బీజేపీ తన విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మోడీ హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే బీజేపీని చరిత్ర క్షమించదని అన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెడితేనే న్యాయం జరుగుతుందని, బీసీ కులాలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.