- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుడు కూడా దానికి డిమాండ్ ఎక్కువే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా సిమెంట్ డిమాండ్ వృద్ధి 2020-21 మార్చితో ముగిసే చివరి త్రైమాసికంలోనూ కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో లిస్టెడ్ సిమెంట్ కంపెనీల మొత్తం వాల్యూమ్‌లు 9 శాతం పెరిగాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నిరంతర వృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో రికవరీ ఈ రంగం బలమైన వృద్ధికి కీలకంగా ఉండనున్నట్టు ఇండ్-రా పేర్కొంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధరల కారణంగా 2021, మార్చిలో బొగ్గు ధరలు స్వల్పంగా పెరిగాయని, మార్చి ముగిసే సమయానికి దాదాపు 60 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని ఇండ్-రా అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్ నుంచి పెరుగుతున్న బొగ్గు ధరలు 30 శాతం పెరిగాయని తెలిపింది. అదేవిధంగా, చివరి త్రైమాసికంలో డీజిల్ ధరలు 20-25 శాతం పెరుగుతాయని ఇండ్-రా వెల్లడించింది.