ఆ వార్తలపై సీఈసీ క్లారిటీ

by Shamantha N |
ఆ వార్తలపై సీఈసీ క్లారిటీ
X

న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపండం కొత్తేమి కాదని, గత సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బలగాలను పంపామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. తాము కేవలం పశ్చిమ బెంగాల్‌కే కేంద్ర బలగాలను పంపించామన్న వార్తలు ప్రచురించినట్టు దృష్టికి వచ్చిందని, దానిపై స్పష్టత ఇవ్వదలిచామని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా సున్నితమైన ప్రాంతాలకు కేంద్ర బలగాలను పంపడం 1980ల నుంచి వస్తున్నదని వివరించింది.

ఈ సారి కూడా కేవలం పశ్చిమ బెంగాల్‌కే బలగాలను పంపామన్నదని అసత్యమని తెలిపింది. మిగతా రాష్ట్రాలు కేరళ, అసోం, తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికీ పంపించామని వివరించింది. అంతేకాదు, కేంద్ర బలగాల మోహరింపునకు ఈ రాష్ట్రాలన్నింటికి ఒకే రోజు(ఈ నెల 16న) ఆదేశాలు జారీ చేశామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed