SARS Covid-2 Virus : సార్స్ కొవిడ్-2 జన్యుక్రమం గుర్తించేందుకు పరిశోధనలు

by Shyam |   ( Updated:2021-06-10 10:13:08.0  )
SARS Covid-2 Research
X

దిశ, తెలంగాణ బ్యూరో: సార్స్ కొవిడ్-2 కరోనా వైరస్‌లోని జన్యక్రమ మార్పులను గుర్తించేందుకు ఐఎన్‌ఎస్ఏసీజీఓ పరిశోధనలు చేపట్టిందని సీసీఎంబీ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూనె నగరాలను పరిశోధన కేంద్రాలుగా ఎంచుకున్నారని తెలిపారు. ఈ నాలుగు నగరాల్లో ఒకే రకమైన పరిశోధనలు చేపట్టేందుకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు.

అత్యాధునిక పద్ధతులతో చేపట్టనున్న ఈ పరిశోధనల ద్వారా వైరస్ కొత్త రూపాంతరాలను, వైరుద్యాలను, వాటి ప్రమాద సమార్థ్యాలను ముందస్తుగానే గుర్తించేందుకు ఉపయోగపడుతాయని వివరించారు. వైరస్ నమూలను సేకరించి ఎప్పటికప్పడు పరిశీలించడం ద్వారా రూపాంతారాలను కచ్చితంగా కనుగొనవచ్చని తెలిపారు.

ఈ పరిశోధనలను హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిఎస్ఐఆర్-సిసిఎంబి) ద్వారా, బెంగుళూర్ నిహమాన్స్ లోని ఎన్‌సిబిఎస్-టిఐఎఫ్ఆర్, ఇన్‌స్టర్మ్ డిబిటి ద్వారా, న్యూ ఢిల్లీలోని సీఎస్ఐఆర్- ఐజిఐబి ద్వారా, పూణేలోని పూణే నాలెడ్జ్ క్లస్టర్, ఐఐఎస్ఇఆర్-పూణే, మరియు సిఎస్ఐఆర్-ఎన్‌సిఎల్ సంస్థల ద్వారా చేపట్టామని తెలిపారు. ఈ సంస్థలన్నీ స్థానిక ప్రభుత్వాల, ఆసుపత్రుల, వైద్యు నిపుణులతో కలిసి పని చేస్తుందని వివరించారు. జాతీయ స్థాయిలో వైరస్ కదలికలపై కచ్చితమైన పరిశోధనలు చేసేందుకు ఐఎన్‌ఎస్ఏసిజీఓ పనిచేయనుందని తెలిపారు.

ఈ పరిశోధనలను సీఎస్‌ఐఆర్-సిసిఎమ్‌బి సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా అధ్యక్షతన ప్రొఫెసర్ సత్యజిత్ మేయర్, ఎన్‌సిబిఎస్, ప్రొఫెసర్ ఎల్ఎస్ శశిధర, సిఎస్‌ఐఆర్-ఐజిఐబి పూణే నాలెడ్జ్ క్లస్టర్ కు చెందిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ సభ్యులుగా వ్యవహరించనున్నారని చెప్పారు. జన్యక్రమాన్ని మార్చుకుంటున్న వైరస్ లు విస్తృతంగా వ్యాప్తి చెందే కంటే ముందే వాటి తీవ్రతను, సామర్ధ్యాన్ని గుర్తించడానికి ఈ బృందం పనిచేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed