- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు క్యాట్ శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) విద్యార్థులకు శుభవార్త అందించింది. 2020 అకడమిక్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తూ నోటీఫికేషన్ జారీ చేసింది. ఐఐఎంలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ ఏడాదికి నోటిఫికేషన్ తీపి కబురునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 6 వందలకు పైగానే బిజినెస్ స్కూళ్ల ప్రవేశానికి మార్గం సుగమం అయింది.
ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ అప్లికేషన్లు ఆగస్టు 5న మొదలుకానున్నాయి. అలాగే, సెప్టెంబర్ 16,2020 దరఖాస్తులను స్వీకరించేందుకు చివరి తేది అని నోటిఫికేషన్‌లో తెలిపింది. అక్టోబర్ 28 నుంచి పరీక్ష తేది వరకు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునేలా వెసులుబాటు కూడా కల్పించనుంది. ఎంట్రెన్స్ టెస్ట్ నవంబర్ 29న నిర్వహించనున్నట్లు ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://iimcat.ac.in/ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా విద్యార్థుల సందేహాలను వెబ్‌సైన్ ద్వారా పరిష్కారం కానున్నాయి.
ముఖ్యమైన సమాచారం, తేదీలు:
టైప్ ఆఫ్ అప్లికేషన్: ఆన్‌లైన్
అప్లై స్టార్టింగ్ డేట్: ఆగస్టు 5, 2020
అప్లై ఎండింగ్ డేట్: సెప్టెంబర్ 16, 2020
అడ్మిట్ కార్డు: అక్టోబర్ 28 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
ఎగ్జామ్ డేట్: నవంబర్ 29, 2020
పరీక్ష నిడివి: 3 గంటలు
విషయం: డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
అఫిషియల్ వెబ్‌సైట్: https://iimcat.ac.in/