జనగణనలో కుల గణన చేయాలి.. ఎంపీ సుభాష్ చంద్రబోస్

by srinivas |
Pilli-Subhash1
X

దిశ, ఏపీ బ్యూరో: బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే తప్ప బలహీనులు కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు శీతకాల సమావేశాల్లో భాగంగా ఎంపీ చంద్రబోస్‌ మంగళవారం బీసీ జనగణన అంశంపై మాట్లాడారు. బీసీల సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవడం లేదని.. సామాజిక వెనకబాటు ఉన్న వారికి రిజ్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో నాలుగు కులాలు తప్ప అందరినీ రిజర్వేషన్లో చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం రాజ్యాంగం స్ఫూర్తి అని ఎంపీ వెల్లడించారు. వెనుకబడిన వర్గాలవారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే రాజ్యాంగం లక్ష్యమని పేర్కొన్నారు. అయితే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కొందరు తప్పుదోవ పాటించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనగణనలో కుల గణన కూడా చేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ రాజ్యసభలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed