- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్‌తో కాసులు వెనకేస్తున్న నెట్‌ఫ్లిక్స్
దిశ, వెబ్‌డెస్క్:
సాధారణంగా లోకల్ యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా కంపెనీలు, మ్యూజిక్ కంపెనీలు సినిమాల్లోని కొన్ని సీన్లను అప్‌లోడ్ చేస్తూ వీడియోలు పెడుతుంటాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓటీటీ యాప్‌లు సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొంటున్నాయి. దీంతో సీన్లను అప్‌లోడ్ చేసే అవకాశం ఇతర యూట్యూబ్ ఛానళ్లకు లేకుండా పోయింది. ఇటీవల అల వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అయితే అల్లు అర్జున్ క్రేజును నెట్‌ఫ్లిక్స్ సొమ్ము చేసుకునేందుకు మంచి ఐడియా వేసింది. ఆ సినిమాలో మీటింగ్ సీన్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి సబ్‌స్క్రైబర్లను ఆకర్షిస్తోంది. నిజానికి నెట్‌ఫ్లిక్స్ ట్రైలర్లు, రివ్యూలు, స్నీక్ పీక్‌లు మాత్రమే యూట్యూబ్‌లో పెడుతుంటుంది. కానీ ఇలా సీన్ పెట్టడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా వీక్షణలు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
tags: Allu Arjun, Ala Vaikunthapurramuloo, Netflix, Youtube, Scenes