లంచమియ్యలేదని గుడ్లు ధ్వంసం.. వీడియో వైరల్

by Anukaran |
లంచమియ్యలేదని గుడ్లు ధ్వంసం.. వీడియో వైరల్
X

ఇండోర్: వంద రూపాయలు లంచమివ్వలేదని మున్సిపల్ అధికారులు బండెడు గుడ్లను ధ్వంసం చేశారు. రోడ్డుపైనే పగిలిన గుడ్లు, అధికారులపై గుడ్లమ్ముకునే 14 ఏళ్ల బాలుడు ఆగ్రహిస్తున్న వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం షాపులను ‘ఎడమ-కుడి వైపు’ పద్ధతిలో ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. తోపుడు బండిపై గుడ్లు అమ్ముకుంటున్న తన దగ్గరకొచ్చి దుకాణం మూసేయాల్సిందిగా ఆదేశించారని, లేదంటే వంద రూపాయల లంచమడిగినట్టు 14 ఏళ్ల బాలుడు తెలిపాడు. కానీ, అందుకు తిరస్కరించడంతో అధికారులు గుడ్లు ఉన్న బండిని తోయడంతో నేలపై పడిందని ఆరోపించాడు. కరోనా వల్ల తన రోజూవారీగా గిరాకీ తగ్గిందని, అధికారుల నిర్వాకంతో ఇంకా అదనపు భారం పడిందని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అధికారులను చూపిస్తూ ఆగ్రహిస్తున్న ఆ బాలుడూ వీడియోలో కనిపించాడు.

Advertisement

Next Story