త్యాగరాజ స్వామిపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పిటిషన్ దాఖలు

by Shyam |
త్యాగరాజ స్వామిపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పిటిషన్ దాఖలు
X

లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. త్యాగరాజ స్వామి గురించి చేసిన కామెంట్స్ ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఆయనను దేవుడిగా కొలిచే ఎంతోమంది సంగీత కళాకారులు మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ లో ఉన్న ప్రముఖులు చాలా మంది సోషల్ మీడియాలో లైవ్ చాట్, వీడియో కాల్స్ అంటూ ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ సేతుపతితో ఓ చానల్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్… పలు అంశాలపై స్పందించారు. వీటిలో ఒకటి సినిమా గురించి కాగా… సినిమా అంటే ఒక్క వ్యాపారం మాత్రమే కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సినిమా అంటే చారిటీ కూడా కాదు.. త్యాగరాజు స్వామి మాదిరి రాముడిని కీర్తిస్తూ భిక్షమెత్తుకోవడం సినిమా కాదు అన్నారు.

దీంతో ఈ వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కర్ణాటక సంగీత కళాకారులు. కాగా పాల్ ఘాట్ రామ్ ప్రసాద్ అనే కళాకారుడు కమల్ నుంచి క్షమాపణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.

Tags: Kamal Hassan, Thyagaraja Swamy, Kollywood, Vijay Sethupathi

Advertisement

Next Story

Most Viewed