SSC CHSL: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల సంఖ్య పెంచిన ఎస్‌ఎస్‌సీ..!

by Maddikunta Saikiran |
SSC CHSL: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల సంఖ్య పెంచిన ఎస్‌ఎస్‌సీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 3712 కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) ఎగ్జామినేషన్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎస్‌ఎస్‌సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన 3712 పోస్టులకు మరో 242 పోస్టులను యాడ్(Add) చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోస్టుల సంఖ్య 3,954కు పెరగనుంది. ఈ పోస్టులకు సంబంధించి టైర్-1 పరీక్షలు(Tier-1 Examinations) జులై లో నిర్వహించగా సెప్టెంబర్ 6న ఫలితాలు రిలీజ్ చేశారు. ఇక టైర్-2 పరీక్షలు(Tier-2 Examinations) నవంబర్ 18న కండక్ట్ చేయగా.. ఫైనల్ రిజల్ట్స్(Final Results)ను త్వరలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు తుది ఫలితాలను ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/login ద్వారా చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్(Clerk), జూనియర్ అసిస్టెంట్(JA), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(Data Entry Operators) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలు, టైపింగ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed