- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
GATE-2025 Exams: గేట్-2025 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తులో మార్పులకు అవకాశం

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఐఐటీ(IIT)లు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్(M.Tech), పీహెచ్‌డీ(PHD) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2025) నోటిఫికేషన్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. అయితే అభ్యర్థులు తమ వివరాలను ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్(Application)లో కొన్ని తప్పుగా నమోదు చేస్తారు. అయితే అటువంటి వారికోసం ఐఐటీ రూర్కీ(IIT Roorkee) శుభవార్త చెప్పింది. గేట్ దరఖాస్తులో ఏమైనా తప్పుగా నమోదు చేసి ఉంటే వారికి మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. అభ్యర్థులు ఫీజు చెల్లించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటర్, జెండర్ లాంటి తదితర వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ అవకాశం నవంబర్ 10 వరకు ఉంటుందని వెల్లడించింది. కాగా గేట్ 2025 ఎగ్జామ్స్(GATE 2025 Exams)ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మూడు గంటల పాటు ఈ పరీక్ష జరగనుంది. అడ్మిట్ కార్డ్‌లు జనవరి 2 నుంచి www.gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మార్చి 19న ఫలితాలను విడుదల చేస్తారు.