- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Disha Special Story : గాలిలో దీపంలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఉఫ్.. అంటూ ఊదేస్తున్న కంపెనీలు
ఐటీ కొలువు అంటే రంగుల ప్రపంచం.. వారానికి ఐదురోజులు పని.. రెండు రోజులు హాలీడేస్.. 5,6అంకెల జీతం.. అన్నీ కుదిరితే అమెరికాలో సెటిల్అయ్యే అవకాశం. ఇదీ సాఫ్ట్వేర్ఉద్యోగులపై అందరికీ ఉన్న అభిప్రాయం. కానీ, వాస్తవానికి ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకి తెలుసు. చేస్తున్న ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో..? ఎప్పుడు పింక్కార్డ్ఇస్తారో..? ఇలా లోలోపల కుమిలిపోతుంటారు. నాలుగైదేళ్లకు ఒకసారి లేఆఫ్ భూతం సునామీలా వచ్చిపడుతుండటంతో సాఫ్ట్వేర్ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో లే ఆఫ్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఖర్చు బూచితో పాటు ఏఐ రీజన్స్ చూపుతూ అనేక సంస్థలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఇంటెల్, ఐబీఎం, సిస్కో వంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 435 కంపెనీలు 1,36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 27 వేల మందికి పైగా ఎంప్లాయీస్‌ను ఆయా సంస్థలు ఇంటికి సాగనంపాయి. గత ఏడాది మొదలైన లేఆఫ్‌ల పర్వం ఈ ఏడు కూడా కొనసాగడంపై ప్రత్యేక కథనం..
- నిసార్
435 సంస్థలు 1,36,000
2022-23లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 4,25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. 2024 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 435 కంపెనీలు 1,36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేశాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 27 వేల మందికి పైగా ఎంప్లాయీస్‌ను ఇంటికి సాగనంపాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు తగ్గడంతో పాటు ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
జాబితాలో ప్రముఖ కంపెనీలు
ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్ సంస్థల పేర్లు సైతం ఉండటం విస్మయానికి గురి చేస్తున్నది. ఇందులో ఇంటెల్, ఐబీఎం, సిస్కో, డెల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు అయితే ఎప్పుడు పడితే అప్పుడే ఎంప్లాయీస్‌ను తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. మొత్తం 40 కంపెనీలు ఒక్క నెలలోనే ఇన్ని లేఆఫ్‌లు చేపట్టడం గమనార్హం. కంప్యూటర్ చిప్‌లు తయారు చేసే ఇంటెల్ సంస్థ 15,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది దాని శ్రామిక శక్తిలో 15 శాతానికి పైగా సమానం. ఈ తొలగింపులు 2025 నాటికి $10 బిలియన్ల ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగమేనని తెలుస్తున్నది. ఇక AI, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి రంగాలపై దృష్టి సారించిన సిస్కో సిస్టమ్స్ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నది. ఐబీఎం చైనాలో తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది, దీంతో 1,000 మంది ఎంప్లాయీస్‌కు పైగా తొలగించింది. జర్మన్ చిప్‌మేకర్ అయిన ఇన్ఫినియన్ 1,400 ఉద్యోగాలను, యాక్షన్ కెమెరా తయారీదారు గోప్రో దాని సిబ్బందిలో 15% మందిని మొత్తం 140 మంది ఉద్యోగులను తగ్గించుకుంటుంది. ఈ తొలగింపులతో 2024 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన ఖర్చుల నుంచి నిర్వహణ ఖర్చులను $50 మిలియన్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఖర్చు తగ్గింపు, ఏఐ పేరుతో..
అనేక టెక్ కంపెనీలు ఖర్చు తగ్గింపుతో పాటు ఏఐ పేరు చెప్పి ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. కానీ దీనికి వెనుక మరో కుట్ర దాగి ఉన్నదని తెలుస్తున్నది. ఉదాహరణకు ఓ కంపెనీ మిడ్లెవల్డెవలపర్కి సంవత్సరానికి రూ.8లక్షలనుంచి రూ.10 లక్షల వరకూ శాలరీ ఇస్తున్నది. ఈ ఉద్యోగిని ఇంటికి పంపించి.. ఇదే శాలరీలో మరో ఇద్దరు, ముగ్గురు కొత్త ఎంప్లాయీస్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇలా.. ఖర్చు తగ్గింపునకు అనేక కంపెనీలు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ఆందోళనలో ఉద్యోగులు..
టెక్ కంపెనీలు ఉద్యోగులను సాగనంపే ప్రక్రియ స్టార్ట్ చేశాక.. ఎంప్లాయీస్‌లో భయం పట్టుకున్నది. లక్షలు పెట్టి చదివి.. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం తమను ఆందోళన కలిగిస్తున్నదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగింపు ప్రభావం తమ ఫ్యూచర్ పైనా పడుతుందని వారు పేర్కొంటున్నారు. ఒక్క సాఫ్ట్ వేర్ రంగంలోనే కాదు ఇతర రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తున్నది. దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ వ్యాపార వృద్ధి మందగించడం, వినియోగదారుల డిమాండ్ తగ్గడం వల్ల భారతదేశంలో 200 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనుంది.
ప్రపంచవ్యాప్తంగా తొలగింపులు (2024)
ప్రపంచవ్యాప్తంగా..