CA మే 2024 దరఖాస్తులలో సవరణలకు అవకాశం..

by Sumithra |
CA మే 2024 దరఖాస్తులలో సవరణలకు అవకాశం..
X

దిశ, ఫీచర్స్ : CA మే 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓ గుడ్ న్యూస్. మే 2024 CA పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తుల సవరణ విండో మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది.

అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను మార్చి 29, 2024 అర్ధరాత్రి 12 గంటల లోపు సవరించుకోవచ్చు. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్ తన అధికారిక వెబ్‌సైట్ icai.orgలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. పూర్తివివరాల కోసం అభ్యర్థులు వెబ్ సైట్ లో తనిఖీ చేయవచ్చు.

దరఖాస్తుల సవరణ ఇలా చేసుకోండి..

అధికారిక వెబ్‌సైట్ icai.org కి లాగిన్ అవ్వండి.

CA మే 2024 సవరణ విండో పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైనవాటిని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

ఇప్పుడు దరఖాస్తులో సవరణలు ఉంటే చేసుకోండి.

లోక్‌సభ ఎన్నికలు 2024తో CA పరీక్షల తేదీలను కూడా ICAI సవరించింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్ష మే 7కి బదులుగా మే 3, 5, 9 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్ష మే 9, 11, 13 తేదీల్లో కాకుండా మే 11, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. 1 మే 6కి బదులుగా మే 2, 4, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. సీఏ ఫైనల్ గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 12 తేదీల్లో కాకుండా మే 10, 14, 16 తేదీల్లో జరగనుంది. అభ్యర్థులు ICAI అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నూతన పరీక్ష షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.

అడ్మిట్ కార్డ్ నిర్ణీత సమయంలో జారీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. ICAI ప్రకారం, ఇప్పుడు పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండదు.

Advertisement

Next Story