‘ఉపాధి హామీ’లో జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్

by Shyam |
‘ఉపాధి హామీ’లో జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో జరగనున్న ఉపాధి హామీ పనుల్లో కరోనా నియంత్రణ చర్యలు తప్పకుండా తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని క్షేత్రస్థాయి అధికారులకు పలు మార్గదర్శకాలతో కూడిన సర్య్కూలర్‌‌ను జారీచేశారు.

ఉపాధి హామీ పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు…

– కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో నిబంధనలు అమలులో ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను ప్రారంభించకూడదు.
– కూలీలు పని ప్రదేశానికి వచ్చేటప్పుడు, వెళ్లే టప్పుడు, పని ప్రదేశంలోనూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
– కూలీలు సామాజిక దూరం పాటించేలా వేరు వేరు ప్రదేశాల్లో పనులు కేటాయించాలన్నారు.
– పని ప్రదేశంలో ఉమ్మి వేయడం, పొగ తాగడం, పాన్, గుట్కా నమలడం వంటివి చేయరాదని పేర్కొన్నారు.
– ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస సంబంధిత వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే, దగ్గరలో ఉన్న పీహెచ్‌సీలో చికిత్స పొందాలన్నారు.
పై ఆదేశాలన్నింటినీ కచ్చితంగా పాటిస్తూ, గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలని జిల్లాలోని కార్యక్రమ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులను అమయ్ కుమార్ ఆదేశించారు.

Tags: Care, Employment Workers, collector amoy kumar, ranga reddy, corona

Advertisement

Next Story

Most Viewed