- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానుల బిల్లు వెనక్కి.. ఎంటీఎంసీ కార్యకలాపాలకు బ్రేక్?
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వం గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యకలాపాలకు బ్రేక్‌లు పడే అవకాశం కనిపిస్తోంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న కొన్ని విలీన గ్రామాలు సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. సీఆర్డీఏ చట్టం అమల్లోకి రావటంతో ఆ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
అమరావతి- సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంటీఎంసీ కార్యకలాపాలపై సందిగ్ధం నెలకొంది.
వాస్తవానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును ఆయా ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. వ్యతిరేకించారు. అంతేకాదు ఈ కార్పొరేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ న్యాయస్థానం పరిధిలో 46కి పైగా పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది. అధికారులు ఎలా ముందుకు వెళ్తారు అనేదానిపై చర్చ జరుగుతుంది. ఇకపోతే గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కలిపి ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని 11 గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 10 గ్రామాలు మొత్తం 21 గ్రామాలు కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1994 ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీని అభివృద్ధికి రూ.1000 కోట్లు సైతం కేటాయించింది. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న తాడేపల్లి-మంగళగిరి ప్రాంతాలు రాష్ట్రంలో అత్యంత కీలకమైన చెన్నై-కోల్‌కతా హైవే పక్కన, రాష్ట్ర ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.