- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి వెనుక పెద్ద నేతలు..మాజీ మంత్రి గంటా వీడియో వైరల్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వార్ నడుస్తోంది. డ్రగ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. వైసీపీ నేతలు డ్రగ్ బిజినెస్ చేస్తున్నారంటూ విరుచుకుపడుతుంది. డ్రగ్స్, హెరాయిన్, గంజాయి మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని పదేపదే ఆరోపిస్తోంది. ఈ అంశమే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఈ ఆరోపణలు కాస్త భౌతిక దాడుల వరకు వెళ్లేలా చేసింది. ఏపీ రాజధాని అమరావతిలో మెుదలైన ఈ లొల్లి ఇప్పుడు దేశ రాజధాని హస్తినకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గంజాయి అక్రమ రవాణాపై టీడీపీ హయాంలో మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
దేశానికి గంజాయి విశాఖ నుంచే సరఫరా అవుతుంది
మాజీమంత్రి గంటా వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచే గంజాయి సరఫరా అవుతుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఓ ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ నుంచి గంజాయి కేవలం రాష్ట్రానికే కాదని యావత్ దేశానికి కూడా సరఫరా అవుతుందని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఓ ఘనత సాధించామంటూ సరదాగా స్పదించారని.. కానీ ఈ అంశంపై చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. గంజాయి రవాణా విషయంలో ఒకరిద్దరిపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని సీఎం అన్నారన్నారు. గంజాయి ఎక్కడ సాగు అవుతుందో అక్కడ నిర్మూలించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాదు ఈ గంజాయి రవాణా వెనుక పెద్దలు ఉన్నట్లు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.