అభ్యర్థులు 29లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి: నవీన్ మిట్టల్

by Shyam |   ( Updated:2020-12-26 07:37:41.0  )
అభ్యర్థులు 29లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి: నవీన్ మిట్టల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపు పూర్తయింది. ఎంబీఏలో 15,545 సీట్లు భర్తీ అయినట్టు ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మిగిలిన 7252 కన్వీనర్ కోటా సీట్లు అని ఆయన వెల్లడించారు. ఎంసీఏలో 1876 సీట్లను భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. కాగా 17 సీట్లు మిగిలినట్టు చెప్పారు. 104 కళాశాలల్లో అన్ని సీట్లు భర్తీ అయినట్టు వెల్లడించారు. ఒక్క సీటు కూడా భర్తీ కాని కళాశాలలు రెండు ఉన్నాయని తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 29లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు.

Advertisement

Next Story