మిస్‌ఫైర్ అవుతున్న ‘జెండర్ రివీల్ పార్టీ’

by Sujitha Rachapalli |
మిస్‌ఫైర్ అవుతున్న ‘జెండర్ రివీల్ పార్టీ’
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రుద్రమదేవి’ మూవీ చాలా మంది చూసి ఉంటారు. అందులో గణపతిదేవుడి పాలనలో సంతోషంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు. ఆ సమయంలో మహారాజుకు ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల రాజ్యాధికారానికి అనర్హురాలు. పైగా, శత్రురాజుల దండెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తారు. అప్పట్నుంచి మూవీ..జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే సినిమాకు టర్నింగ్ పాయింట్. అయితే, ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే‘జెండర్’ రివీల్ చేయడం. అదే ఇప్పుడు ఒక ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం విదేశాల్లో ‘జెండర్ రివీల్’ పేరుతో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతున్నాయి. అదో వేడుకలా చేసుకుంటున్నారు. తమకు పుట్టిన బిడ్డ పాప లేదా బాబు అనే విషయాన్ని స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు తెలియజేయడం. దీన్నే ఓ వేడకలా చేస్తున్నారు.
మనదేశంలో ఆడబిడ్డ పుట్టగానే ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందని, మగబిడ్డ పుట్టగానే వారసుడు వచ్చాడని జనరల్‌గా చెబుతుంటారు. అయితే, విదేశాల్లో అలా కాదు. డాక్టర్లు తమకు పుట్టిన బిడ్డ ఆడ లేదా మగ అనే విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పరు. డాక్యుమెంట్‌తో సహా ఓ సీల్డ్ ఎన్వలప్‌లో పెట్టి, పేరేంట్స్‌కు అందజేస్తారు. పేరేంట్స్ అది ‘జెండర్ రివీల్ పార్టీ’ చేసే ఈవెంట్ మేనేజర్స్‌కు అందిస్తారు. లేదా.. తమ సొంతంగా పార్టీ ఎలా చేయాలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటారు. ‘జెండర్ రివీల్ పార్టీ’ ఆలోచనతో 2008లో తొలిసారి పార్టీ నిర్వహించిన వ్యక్తి జెన్న కర్వుండిస్. ఆనాటి నుంచి మొదలైన ఈ పార్టీ ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్‌గా కొనసాగుతోంది.

తాజాగా అనాస్, అసాలా మార్వా జంట తమ కొడుకు జెండర్ రివీల్ పార్టీని దుబాయ్‌లోని ‘బూర్జ్ ఖలీఫా’లో చేశారు. ఆ భవనం మొత్తం బ్లూ అండ్ పింక్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోయింది. 10-1 కౌంట్‌డౌన్ స్టార్ట్ కాగానే ‘బ్లూ’ రంగుల్లో భవనం మొత్తం మిరుమిట్లుగొలిపింది. దట్స్ ఇట్.. వాళ్లకు పుట్టింది బాబు అని కన్ఫార్మ్ అయ్యింది. ఆ బూర్జ్ ఖలీఫా భవనంపై ఇట్స్ ఏ బాయ్ అని దర్శనమిచ్చింది. అనాసాల ఫ్యామిలీ (anasala family)యూట్యూబ్‌లో ఈ పార్టీ వీడియో మొత్తాన్ని అప్‌లోడ్ చేసింది. అయితే, బూర్జ్ ఖలీఫా భవనం మీద మూడు నిముషాల యాడ్ కోసం దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కేవలం జెండర్ రివీల్ కోసం వీళ్లు కోటికి పైగానే ఖర్చు చేశారు. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే..మరో వైపు ఈ పార్టీల వల్ల బోలెడు నష్టాలు జరిగాయి. రీసెంట్‌గా కాలిఫోర్నియా కార్చిచ్చు కూడా ఓ జెండర్ రివీల్ పార్టీనే కారణమని జాతీయ మీడియా తెలుపుతుంది.

కాలిఫోర్నియా కార్చిచ్చు

యూకాపియాలోని ‘ఎల్ డోరాడో రెంజ్ పార్కు’లో ఓ ‘జెండర్ రివీల్ పార్టీ’జరిగింది. అందులో భాగంగా ‘పైరో టెక్నిక్ ’ పరికరంతో ఫైర్ వర్క్స్ చేశారు. ఆ ఫైర్ వర్క్స్ కాస్త.. మంటలు అంటుకుని దవానలంలా వ్యాపించిందని తెలుస్తుంది. పది వేల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి.

అరిజోనా వైల్డ్ ఫైర్-2017

2017, ఏప్రిల్‌లో అరిజోనాలో జరిగిన కార్చిచ్చు వల్ల.. 47వేల ఎకరాలు దగ్ధమయ్యాయి. అరిజోనా, టస్కన్‌లోని గ్రీన్ వ్యాలీకి దగ్గర్లో ఉన్న ఓ ఎడారిలో ‘జెండర్ రివీల్ పార్టీ’జరిగింది. ఆ పార్టీలో ఓ వ్యక్తి.. బ్లూ లేదా పింక్ రంగులతో నిండి ఉన్న పొగతో కూడిన ఓ డివైజ్‌ను షూట్ చేస్తాడు. అది పేలి ఆ రంగు పొగ వెలువడుతుంది. బ్లూ అయితే బాయ్ అని, పింక్ అయితే గర్ల్ అని అర్థం. అది మిస్‌ఫైర్ కావడంతో అరిజోనాలో మంటలు వ్యాపించాయి. దాని వల్ల 8మిలియన్ డాలర్ల నష్టం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను ‘యూఎస్ ఫారెస్ట్ సర్వీస్’ విడుదల చేసింది. అంతేకాదు.. 2020 ఏప్రిల్‌లో కూడా.. జెండర్ పార్టీ రివీల్ నిర్వాహకుల కారణంగా ఫ్లోరిడాలో 10ఎకరాల బుష్ ఫైర్ జరిగింది.

క్వీన్స్‌లాండ్ కార్ ఫైర్ – 2018

ఆస్ట్రేలియాలోని, క్వీన్స్‌లాండ్‌లో ఓ జంట జెండ్ రివీల్ పార్టీ కోసం తమ కారులో పొగ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ ట్రిక్ కాస్త ఫెయిల్ కావడంతో కారు మొత్తం దగ్ధం అయ్యింది. జెండర్ రివీల్ పార్టీల వల్ల ఎన్నో నష్టాలు ఎదురవడంతో దీని ‘ఇన్వెంటర్’ జెన్న కర్వుండిస్ సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీలను ఇక్కడితో ఆపాల్సిందిగా వేడుకున్నాడు. పార్టీ అంటే అందరూ సంతోషంగా చేసుకోవాల్సిన వేడుకనీ, కానీ, ఇలా అందరికీ నష్టం చేకూర్చేలా చేయకూడదని పేర్కొన్నాడు.

టెక్సాస్ ప్లేన్ క్రాష్-2019

టెక్సాస్, టర్కీలో ‘జెండర్ రివీల్ పార్టీ’ వల్ల ప్లేన్ క్రాష్ అయ్యింది. జెండర్ రివీల్ చేసేందుకు పైలట్ 350 గ్యాలన్ల పింక్ వాటర్‌ను ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలివేశాడు. అది అదుపు తప్పి ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది.

ఐవా పైప్ బాంబ్ ఎక్స్‌ప్లోజన, 2019

2019లో అక్టోబర్‌లో అమెరికా, ఐవా స్టేట్‌లో ఓ జెండర్ రివీల్ పార్టీ జరిగింది. ఆ సందర్భంగా నిర్వాహకులు ‘ఇన్ అడ్వర్టటెంట్ పైప్ బాంబ్’ను వాడారు. ఇది కూడా పేలిపోయి బ్లూ లేదా పింక్ స్మోక్‌ను వెదజల్లుతుంది. అయితే, ఈ మెటల్ బాంబ్ కాస్త 45 అడుగుల ఎత్తుకు ఎగిరి అక్కడ నిల్చున్న ఓ వృద్ధ మహిళను తాకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

Next Story

Most Viewed