- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో ఒక డివిజన్‌కు, 8 వార్డులకు ఉప ఎన్నికలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీనికి కూడా రేపట్నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డు, నల్గొండ మున్సిపాలిటీలో 26వ వార్డు, జల్పల్లిలో 28వార్డు, అలంపూర్‌లో 5వ వార్డు, బోధన్‌లో 18వ వార్డు, పరకాలలో 9వ వార్డు, మెట్పల్లిలో 8వ వార్డు, బెల్లంపల్లిలో 30వ వార్డు, జీహెచ్ఎంసీలో 18వ వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి కూడా ఈ నెల 30న పోలింగ్ ఉంటోంది.
ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కూడా ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. 18వ డివిజన్‌కు నేటి నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 19న పరిశీలన ఉంటుంది. 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి అదే రోజున సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇక్కడ మాత్రం ప్రచారానికి ఎనిమిది రోజులు అవకాశం ఇచ్చారు. జీహెచ్ఎంసీ 18వ డివిజన్లో కూడా ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా… మే 3న కౌంటింగ్ ఉండనుంది.
ఏడు పురపాలికల్లో మొత్తం 11,26,221 మంది ఓటర్లు ఉండగా… 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులున్నారు. మొత్తం 248 వార్డులను విభజించారు. 1532 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 203 రిటర్నింగ్ అధికారులు, 203 మంది అసిస్టెంట్ రిరట్నిగ్ అధికారులు, 6070 పోలింగ్ సిబ్బంది, 1555 మంది కౌంటింగ్ సిబ్బంది, 97 మంది జోనల్ అధికారులు, 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 22 సర్వెలైన్స్ బృందాలు, 8 మంది జనరల్ అబ్జర్వర్లు, 778 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 వ్యయ పరిశీలన బృందాలు, 20 మంది అదనపు వ్యయ పరిశీలన సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికలకు 2479 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు.
కాగా పోటీ చేసే అభ్యర్థులకు ధరావత్తును ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో జనరల్ అభ్యర్థులు రూ. 2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1250 చొప్పున, కార్పొరేషన్లలో జనరల్ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులు రూ. 2,500 చొప్పున నామినేషన్ ధరావత్తు చెల్లించాల్సి ఉంటోంది.
అదే విధంగా జీహెచ్ఎంసీలో అభ్యర్థులు రూ. 5 లక్షలు, మిగిలిన కార్పొరేషన్లలో రూ. 1.50 లక్షలు, మున్సిపాలిటీలో రూ. 1 లక్ష వరకు ప్రచార ఖర్చును ఖరారు చేస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది.