- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూపీఐ సేవలను ప్రారంభించిన Zomato!
by Harish |

X
గురుగ్రామ్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో యూపీఐ సేవలు ప్రారంభించింది. దీనికోసం ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం చేసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో ఇకమీదట జొమాటో ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులు నేరుగా జొమాటోలోనే చెల్లింపులను పూర్తి చేయవచ్చు. ఫోన్‌పే, గూగుల్ఏ వంటి థర్డ్ పార్టీ యాప్‌లతో పనిలేకుండా చెల్లింపులు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల తరహాలో జొమాటోలో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆర్డర్ల చెల్లింపులు చేయవచ్చు. గత కొన్నేళ్లలో ఫుడ్ ఆర్డర్ కోసం వినియోగదారులు యూపీఐ సేవలనే అత్యధికంగా వాడుతున్నట్టు గమనించామని, దానికి పరిష్కారంగా ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ సేవలను తీసుకొచ్చామని జొమాటో పేర్కొంది.
Next Story