- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షావోమి కారు ధర వివరాలు వెల్లడించిన కంపెనీ సీఈఓ
దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ వాహన తయారీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో కారు మోడల్‌ను లాంచ్ చేసిన కంపెనీ ఈ వారంలో మొదటి కారు కోసం ఆర్డర్లు తీసుకొనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షావోమీ సీఈఓ లీ జున్ కీలక ప్రకటన చేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్, సులభమైన డ్రైవింగ్ సౌకర్యంతో వస్తున్న షావోమీ స్మార్ట్ కారు ధరను అందుబాటు ధరలో తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. ధర 5 లక్షల యునాన్‌లు(మన కరెన్సీలో సుమారు రూ. 58 లక్షల) కంటే తక్కువగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ ఆల్ట్రా 7(ఎస్‌యూ7) పేరుతో మార్కెట్లోకి వస్తున్న షావోమీ కారు మార్చి 28(గురువారం) నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఆరోజే ధరల వివరాలు వెల్లడించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే వాహన రంగంలో అత్యంత ఆసక్తిగా మారిన షావోమీ కారును ప్రపంచంలోనే మొదటి ఐదు అతిపెద్ద కార్ల బ్రాండ్‌గా నిలపాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ఇదివరకు ప్రకటనలో వెల్లడించింది. టెస్లా, పోర్షె ఈవీల కంటే మెరుగైన టెక్నాలజీ షావోమీ ఉపయోగించినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌యూ7 రెండు వేరియంట్లలో రానుండగా, ఒకటి 668 కిలోమీటర్లు, మరొకటి 800 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.