- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PF Interest Rate Hike: PF ఖాతాదారులకు బందర్ హల్వా లాంటి వార్త.. తప్పకుండా చదవండి!

దిశ, వెబ్‌డెస్క్: PF Interest Rate Hike: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్ (pf)వడ్డీరేటు పెంపుపై ఫిబ్రవరి 28న జరగనున్న ఈపీఎఫ్ఓ(EPFO) బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
2025 బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అనేక ప్రకటనలు, హామీలు ఇచ్చింది. వీటిలో ముఖ్యమైంది రూ. 12లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు. ఇప్పుడు ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగస్థులైన మధ్యతరగతి వారికి మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎఫ్ వడ్డీ రేటు(PF Interest Rate)ను ప్రభుత్వం పెంచుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం ఫిబ్రవరి 28న జరగనుంది. దీనిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు (PF Interest Rate)పెంపుపై చర్చ జరుగుతుందని అంచనా. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి(Union Labour Minister) అధ్యక్షత వహించనున్నారు. యజమానుల సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి అధికారిక ఎజెండా ఇంకా విడుదల కాలేదు.
ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై ఫోకస్ పెట్టింది. డిమాండ్, వినియోగాన్ని పెంచడం అవసరం ఉంటుంది. ఆదాయపు పన్ను(Income tax) మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత ఇప్పుడు పీఎఫ్(PF) వడ్డీరేటు(PF Interest Rate)ను పెంచడాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. దీని వల్ల మధ్య తరగతి ఉద్యోగుల పీఎఫ్(PF) పొదుపుపై ఎక్కువ రాబడి వస్తుంది. దీంతో వారు ఇతర ఖర్చులను కూడా పెంచుకోవచ్చు.
ప్రభుత్వం వరుసగా 2ఏళ్లుగా వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయని పీఎఫ్ ఖాతాదారులు(PF account holders) ఆశిస్తున్నారు. 2022-23లో పీఎఫ్ రేటును ప్రభుత్వం 8.15శాతానికి పెంచింది. ఆ తర్వాత 2023-24 లో 8.25శాతానికి పెంచారు. అప్పటి నుంచి పీఎఫ్ కి అదే వడ్డీ రేటు వర్తిస్తోంది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మరింత పెంచే ఛాన్స్ ఉంది.
బ్యాంకుల ప్రస్తుత బేస్ రేటును బట్టి చూస్తే పీఎఫ్ వడ్డీ రేట్ల(PF Interest Rate)లో పెద్దగా పెరుగుదల కనిపించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గతంలో మాదిరిగానే 0.10శాతం పెంచే అవకాశం ఉంది. దేశంలో 7కోట్లకు పైగా ప్రజలు ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు. కొత్త సభ్యులు నిరంతరం ఇందులో చేరుతున్నారు. ఈపీఎఫ్ఓ(EPFO) పదవి విరమణ నిధిలో డబ్బును డిపాజిట్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.