Whatsapp: ఫోన్ నంబర్‌తో పనిలేకుండా ఛాటింగ్.. త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్

by S Gopi |
Whatsapp: ఫోన్ నంబర్‌తో పనిలేకుండా ఛాటింగ్.. త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫోన్ నంబర్‌లకు బదులుగా యూజర్‌నేమ్‌లను ఉపయోగించి ఇతరులతో చాట్ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల యూజర్లు తమ వ్యక్తిగత వివరాల నుంచి గోప్యతను కలిగి ఉంటారని, ఎవరికైనా మెసేజ్ పంపేటపుడు వారి మొబైల్ నంబర్ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ వినియోగానికి ఫోన్ నంబర్ ప్రధాన ఐడెంటిఫైయర్‌గా ఉన్న నేపథ్యంలో కొత్త ఫీచర్ కీలక మార్పుగా భావించవచ్చు. ఫోన్ నంబర్ బహిర్గతం చేయకుండా కమ్యూనికేట్ చేసే వీలుండటం వల్ల యూజర్ల ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు సంబంధించి పరిశోధన జరుగుతోందని, త్వరలో అందుబాటులోకి రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు పర్సనల్ డేటా ఎదుటివారికి చేరకపోవడం వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. కాగా, ఇప్పటికే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవి కాకుండా వాట్సాప్‌లోనే ప్రత్యేకంగా సేవ్ చేసుకునే ఫీచర్‌ను అందిస్తోంది. కొత్త ఫీచర్ ద్వారా మరింత సౌకర్యవంత్నగా వాట్సాప్ వినియోగం ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed