Vodafone Idea: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌తో చర్చలు జరుపుతున్న వొడాఫోన్ ఐడియా

by S Gopi |
Vodafone Idea: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌తో చర్చలు జరుపుతున్న వొడాఫోన్ ఐడియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా కోల్పోతున్న మార్కెట్ వాటా కోసం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కైపర్‌లతో సహా ప్రపపంచ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది. ప్రధానంగా దేశీయ మార్కెట్లో ప్రధాన పోటీగా ఉన్న ఎయిర్‌టెల్, జియో కంపెనీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, సబ్‌స్క్రైబర్లను కాపాడుకునేందుకు, 5జీ నెట్‌వర్క్ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కంపెనీ తాజా నిర్ణయం తీసున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్టార్‌లింక్, కైపర్‌లతో భాగస్వామ్య ప్రక్రియ చర్చల దశలోనే ఉన్నాయని, త్వరలో అప్‌డేట్ ఇవ్వనున్నట్టు వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్‌బీర్ సింగ్ తెలిపారు. పోటీ కంపెనీల తరహాలో 5జీ విస్తరణ కోసం వొడాఫోన్ ఐడియా దూకుడుగా వెళ్లాలని అనుకోవట్లేదు. నెట్‌వర్క్ బలోపేతం చేసేందుకు, కస్టమర్లను కాపాడుకునేందుకు కీలక నగరాల్లో మెరుగైన సేవలందిస్తామని జగ్‌బీర్ సింగ్ వివరించారు. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5జీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు 5జీ సేవల ధరలను రూ. 299 నుంచి అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ. 379, జియో రూ. 349 నుంచి ప్లాన్‌లను అందిస్తున్నాయి.



Next Story

Most Viewed