- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vi Super Hero Plan: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్ న్యూస్.. అర్థరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(Vi) అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దేశంలోని టెలికాం కంపెనీల్లో వొడాఫోన్ ఐడియా అత్యధికంగా రూ. 2,07,000 లక్షల కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉంది. అలాగే జులైలో రీఛార్జ్ ప్లాన్ల(Recharge plans) రేట్లను కూడా భారీగా పెంచింది. దీంతో కస్టమర్లు ఐడియాను వదిలి ఇతర నెట్ వర్క్ లోకి పోర్ట్(PORT) అయితున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల(Customers)ను ఆకట్టుకోవడానికి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రీపెయిడ్ యూజర్ల(Prepaid Users) కోసం సరికొత్త ఆఫర్(New Offer)ను ప్రకటించింది. సూపర్ హీరో(Super Hero) ప్రీపెయిడ్ ప్లాన్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో యూజర్లు అర్థరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా(Unlimited Data) యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు వారంలో మిగిలిన డేటాను వారాంతంలో వాడుకోవచ్చు. అయితే రోజుకి 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటా కలిగిన ప్లాన్ వేసుకున్న వారికి మాత్రమే ఈ సూపర్ హీరో ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ ప్లాన్ అమలవుతుందని, త్వరలోనే మిగిలిన ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొస్తామని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.