- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
$800 మిలియన్ల రుణాలను తిరిగి చెల్లించిన వేదాంత
ముంబై: అనిల్ అగర్వాల్‌కు చెందినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ క్రమంగా తన రుణ భారాన్ని తగ్గించుకుంటుంది. ఇప్పటికే పలు దఫాలుగా రుణాలను చెల్లించిన కంపెనీ తాజాగా, లండన్, హాంకాంగ్‌లోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుండి తీసుకున్న $800 మిలియన్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. మైనింగ్ దిగ్గజం వేదాంత గతంలో నాలుగు బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఒక బిలియన్ డాలర్లను చెల్లించినట్లు ప్రకటించగా, ఇప్పుడు తాజాగా $800 మిలియన్ల రుణాన్ని తిరిగి చెల్లించింది.
గత ఫిబ్రవరి 2022 సంవత్సరంలో.. వేదాంత కంపెనీ రానున్న మూడు సంవత్సరాలలో మొత్తం రుణాన్ని తగ్గించుకుని, తద్వారా నికర సున్నా రుణ సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ గోవా, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఇనుప ఖనిజం, బంగారం, అల్యూమినియం గనులను నిర్వహిస్తుంది. వీటితో పాటు జాంబియా, నమీబియా, దక్షిణాఫ్రికాలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి : ighest Inflation country | ద్రవ్యోల్బణం రేటు 264%!.. ఏ దేశంలో తెలుసా?