Aadhaar card :ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన కేంద్రం

by Harish |   ( Updated:2023-05-03 14:18:06.0  )
Aadhaar card :ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజలు తమ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుతో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవడానికి కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా ఏ మెయిల్ ఐడీ లింక్ అయ్యిందో కూడా తెలుసుకునే ఆప్షన్‌ను అందిస్తుంది.

దీనికోసం మైఆధార్ వెబ్‌సైట్‌ https://myaadhaar.uidai.gov.in/ /mAadhaar యాప్‌లోకి వెళ్లి వెరిఫై మొబైల్ నెంబర్/ఈమెయిల్ అనే ఆప్షన్‌ను ఎంటర్ చేయాలి. దాంట్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా నమోదు చేయాలి. తరువాత సెండ్ OTP పై క్లిక్ చేస్తే ఆధార్ కార్డు లింక్ అయిన నెంబర్‌కు కన్ఫర్మేషర్ మెసేజ్ వెళ్తుంది. ఒకవేళ వేరే నెంబర్‌కు వెళ్తే యూఐడీఏఐ హెచ్చరిస్తుంది. అలాగే, లింక్ అయిన మొబైల్ నెంబర్ చివరి మూడు అంకెలను చూపిస్తుంది. దీని ద్వారా OTP ఏ నెంబర్‌కు వెళ్లిందే తెలుసుకోవచ్చు. ఒకవేళ వేరే నెంబర్‌ లేదా ఈ మెయిల్‌ లింక్ అయినట్లు గుర్తిస్తే గనక వెంటనే దగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి మార్పులు చేసుకోవచ్చు.

Read more:

ఏడాదికి రూ.399 చెల్లిస్తే చాలు.. పోస్టాఫీసులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్

PAN Card : ఆధార్‌తో తప్పుడు పాన్ లింక్ అయిందా..? అయితే ఈ విధంగా సరిదిద్దుకోండి!

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story