ఎక్కువ మంది మహిళా బిలీయనీర్ల జాబితాలో భారత్

by S Gopi |
ఎక్కువ మంది మహిళా బిలీయనీర్ల జాబితాలో భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అత్యధిక మహిళా బిలీయనీర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. వచ్చే నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిటీ ఇండెక్స్ చేసిన అధ్యయనం ప్రకారం, అమెరికా 97 మందితో ప్రపంచంలోనే అత్యధిక మహిళా బిలీయనీర్లను కలిగి ఉంది. అంతేకాకుండా యూఎస్ తర్వాత చైనా 42 మందితో రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపద కలిగిన మహిళా బిలీయనీర్ల కలిగిన దేశంగా అమెరికా నిలిచింది. వాల్‌మార్ట్ వారసురాలు అలిస్ వాల్టన్ సహా ప్రపంచంలోని 5 మది మహిళా ధనవంతుల్లో నలుగురు అమెరికాకు చెందినవారు కావడం విశేషం. 22 మది మహిళా బిలీయనీర్లతో జర్మనీ మూడో స్థానంలో నిలవగా, యూరప్ 19 మందితో నాలుగో స్థానంలో ఉంది. ఇక, భారత్ 15 మంది మహిళా బిలీయనీర్లతో ఐదవ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్(20.2 బిలియన్ డాలర్లు - రూ. 1.67 లక్షల కోట్ల) అగ్రస్థానంలో ఉండగా, సైరస్ మిస్త్రీ భార్య రోహికా సైరస్ మిస్త్రీ(7.5 బిలియన్ డాలర్లు - రూ. 62 వేల కోట్లు ) రెండోస్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా లోరియల్ వైస్-ఛైర్‌పర్సన్ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 90.2 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. న్యూయార్క్‌కు చెందిన జూలియా కోచ్(59.8 బిలియన్ డాలర్లు), అలిస్ వాల్టన్(63.7 బిలియన్ డాలర్లు) రెండు, మూడవ స్థానాల్లో ఉన్నారు. జాక్వెలిన్ మార్స్(39.5 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానం, మిరియం అడల్సన్ అండ్ ఫ్యామిలీ(36.1 బిలియన్ డాలర్లు) ఐదవ స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story