Union Budget 2025: ఉద్యోగస్తులకు నిర్మలమ్మ గుడ్‌ న్యూస్..? పన్నుచెల్లింపులపై కీలక అప్‌డేట్!

by Vennela |   ( Updated:2025-01-19 05:47:48.0  )
Union Budget 2025: ఉద్యోగస్తులకు నిర్మలమ్మ గుడ్‌ న్యూస్..? పన్నుచెల్లింపులపై కీలక అప్‌డేట్!
X

దిశ, వెబ్ డెస్క్: Union Budget 2025: వార్షిక బడ్జెట్ 2025కు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పటివలే ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రెండు , మూడు కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త ఆదాయపు పన్ను చట్టా(New income tax law)న్ని తీసుకువస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో(Union Budget 2025)నే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండో విడత సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఐటీ చట్టా(IT Act)న్ని మరింత సులభం చేస్తూ..నిబంధనలు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లుగా సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశా(Parliament budget session)ల్లో కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి బిల్లును ప్రవేశపెడతాము. ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ కాదు. పూర్తిగా ఇది కొత్త చట్టం. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయ మంత్రిత్వ శాఖ(Ministry of Justice) పరిశీలిస్తోంది. బడ్జెట్ రెండో విడత సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget sessions of Parliament) రెండు విడతల్లో నిర్వహిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఈనెల 31న పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 2025-26 ఆర్ధిక ఏడాదికి గాను బడ్జెట్ ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆదాయపు పన్ను బిల్లు చర్చకు వస్తుంది.

ఆదాయపు పన్ను చట్టం 1961 అనేది 6 దశాబ్దాల క్రితం ఈ చట్టంలో ప్రత్యక్ష కార్పొరేట్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్నులు, గిఫ్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఇలా అన్నీ కలిపి 298 సెక్షన్లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకునేలా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(Central Board of Direct Taxes) అంతర్గతంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పలు అంశాలు ప్రజాభిప్రాయాలు, సలహాలను స్వీకరించింది. అలా ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department)కు మొత్తం 6,500 సూచలు వచ్చాయి. వీటిని పరిగణలోనికి తీసుకుని కొత్త బిల్లును రూపొందిస్తున్నట్లు సమాచారం. పరిమాణ పరంగా 60శాతం తక్కువ పేజీల్లో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని తెలుస్తోంది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కష్టం లేకుండా మరింత సులవుగా నిబంధనలు అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Next Story

Most Viewed