- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ కంపెనీల్లో 30 శాతం తగ్గనున్న ఫ్రెషర్ల నియామకం!
బెంగళూరు: దేశీయ ఐటీ సేవల కంపెనీల్లో ఫ్రెషర్లకు గడ్డుకాలం కొనసాగుతోంది. 2021 నుంచి 2022, అక్టోబర్ వరకు ఐటీ సేవల సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయి. అయితే ఆ తర్వాత అమెరికాల్లో నెలకొన్న మాంద్యం భయాలు, బలహీన ఒప్పందాల కారణంగా ఫ్రెషర్లను తీసుకోవడం తగ్గించాయి. తాజాగా, ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సహా ఇతర ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను 30 శాతం తగ్గిస్తాయని వెల్లడించింది.
అంతేకాకుందా 2022, 2023 సమయంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన ఫ్రెషర్లు ఆన్‌బోర్డింగ్ విషయంలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాది కంపెనీలు కొందరికీ జాయిన్ తేదీని చెబుతామన్నప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరికొందరికి ఆఫర్ లెటర్‌ల గడువు ముగుస్తున్న కారణంతో అదనపు ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పాయి. ఇంకొందరి ఆఫర్ లెటర్లను రద్దు చేశారు. ఉద్యోగుల సంఘం ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా ప్రకారం, ఇప్పటికీ 20,000-25,000 మధి ఫ్రెషర్లు ఆన్‌లైన్ బోర్డింగ్‌లో జాప్యం గురించి ఫిర్యాదులు అందాయన్నారు.