- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ. 25 కోట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25.4 కోట్లు వేతనంగా అందుకున్నారు. గతేడాది జూన్ 1న కంపెనీ బాధ్యతలు తీసుకున్న ఆయన, అంతకుముందు కంపెనీ బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. అయితే, కృతివాసన్ జీతం కంపెనీ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ కంటే కొంచెం తక్కువగా ఉంది. రాజేష్ గోపీనాథన్ 2022-23లో రూ. 29.16 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ఇక, ఈ నెల పదవీ విరమణ చేయనున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం 2023-24లో రూ. 26.18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. గణపతి సుబ్రమణ్యం జీతం అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 8.2 శాతం పెరిగింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలోని ఉద్యోగుల సగటు వేతనం 10.8 శాతం పెరిగింది. అత్యుత్తమ పనితీరు కలిగిన ఉద్యోగులు రెండంకెల పెంపును కూడా అందుకున్నారు. భారత్‌కు వెలుపల ఉన్న కంపెనీ ఉద్యోగులకు సగటున 1.5-6 శాతం మధ్య జీతాలు పెంచినట్టు కంపెనీ పేర్కొంది.