2.51 లక్షల వాహనాల అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

by Harish |   ( Updated:2023-04-01 13:39:44.0  )
2.51 లక్షల వాహనాల అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్
X

ముంబై: ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొత్తం 2,51,822 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ శనివారం ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికం 2,43,459 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 3% ఎక్కువ. ముఖ్యంగా ఈ-కామర్స్, నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మైనింగ్ కోసం భారీ ట్రక్కులకు బలమైన డిమాండ్ కారణంగా ట్రక్కులు, బస్సులతో సహా మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 54,435 యూనిట్లకు చేరుకున్నాయి.

కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. కొత్త BS VI దశ IIతో, ఉద్గార నిబంధనలను పాటిస్తూ అమ్మకాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, FY23 భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల విక్రయాలలో కొత్త రికార్డును నెలకొల్పింది. సెమీకండక్టర్ కొరత సడలింపు వంటి కారణాల వల్ల పరిశ్రమ ద్వారా బాగా వృద్ధి చెందిందని అన్నారు.

Also Read..

అమ్మకాలలో దుమ్మురేపిన హ్యుందాయ్ మోటార్స్

Advertisement

Next Story

Most Viewed