- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stock Market: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల నష్టాలు.. సెన్సెక్స్ 548 పాయింట్లు పతనం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు పరిస్థితుల కారణంగా సోమవారం సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లో పతనమయ్యాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తూ చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లనూ ప్రభావితం చేశాయి. ప్రధానంగా ట్రంప్ వ్యాఖ్యలు చైనా మార్కెట్లలో ఆందోళనలు లేవనెత్తాయి. ఎప్పటి నుంచి టారిఫ్ అమలు అనేదానిపై స్పష్టత ఇవ్వనప్పటికీ, తమపై పన్నులు విధించే వారిపై తాము కూడా పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలతో మార్కెట్లను దెబ్బతీశాయి. దీనికి తోడు దేశీయంగా మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం, తాజా పరిణామాలతో మన కరెన్సీ విలువ అమెరికా డాలరుతో పోలిస్తే మరింత క్షీణించడం, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఈ క్రమంలోనే వరుస నష్టాల కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో మదుపర్ల సంప్దగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 6 లక్షల కోట్లు క్షీణించి రూ. 418 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 548.39 పాయింట్లు పతనమై 77,311 వద్ద, నిఫ్టీ 178.35 పాయింట్లు నష్టపోయి 23,381 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్ సహా కీలక రంగాలన్నీ 2 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, జొమాటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.49 వద్ద ఉంది.